(Local) Tue, 27 Oct, 2020

పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోండి - విజయ్ రూపాని

September 17, 2019,   10:38 AM IST
Share on:
పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోండి - విజయ్  ...

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్  రూపానీ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ను వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పారు. భారత్‌ ఏక్తా మంచ్‌ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ కూడా మనదే. పిఓకెనే వదులకునేందుకు పాకిస్తాన్‌ సిద్ధంగా ఉండాలి. సమైక్య భారతావని కోసం తాము పిఓకెను కూడా సాధించి తీరుతాం.

పాకిస్తాన్‌ ఉగ్రవాదులను మద్ధతు పలకడం మానుకోవాలి. దీన్ని భారత్‌ ఏ మాత్రం సహించదని  విజయ్ రూపానీ తేల్చి చెప్పారు. 1971లో ఢిల్లీని ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నించిందని…అయితే, అప్పుడు కరాచీని పోగొట్టుకునే పరిస్థితి ఆ దేశానికి వచ్చిందని ఎద్దేవా చేశారు. పాక్‌ సైన్యం తమకు లొంగిపోయిందని గుజరాత్‌ ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 

సంబంధిత వర్గం
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.