(Local) Sun, 20 Oct, 2019

పాకిస్తాన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

August 14, 2019,   7:22 PM IST
Share on:
పాకిస్తాన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ కు స్వాతంత్య్రం సాధించేందుకు భారత్ తో యుద్ధానికైనా సిద్ధమేనన్నారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్ పై పాక్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పర్యటించిన ఇమ్రాన్ ఖాన్.. మోడీ సర్కార్ తన ఫైనల్ కార్డును ఉపయోగించిందని… అయితే భారత్ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు. కాశ్మీర్ ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల పట్ల మేం చింతిస్తున్నామని… భారత్ వ్యూహాత్మక తప్పిదం చేసిందని అన్నారు. అంతర్జాతీయ సమాజం మాట్లాడక పోయిన కాశ్మీర్ ప్రజల తరపున నేను మాట్లాడుతానన్నారు. కాశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడానని పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.