(Local) Mon, 23 Sep, 2019

మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కిన పాక్

August 16, 2019,   3:41 PM IST
Views: 95
Share on:
మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కిన పాక్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కారు. జమ్మూకశ్మీర్ విషయంలో ప్రధాని మోడి నేతృత్వంలోని హిందుత్వ మూకలు అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలు విఫలమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ ప్రపంచంలో సైన్యాలు, మిలిటెంట్లు, ఉగ్రవాదులను అంతకంటే బలమైన శక్తి అణచివేయగలదని చెప్పారు.

కానీ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడే ప్రజలు చావుకు భయపడరని స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలో ఏ శక్తీ వాళ్లను తమ లక్ష్యానికి చేరుకోకుండా అడ్డుకోలేదని అన్నారు. ఈ విషయాన్ని హిందుత్వ విధానాలకు వకల్తా పుచ్చుకున్న ఫాసిస్ట్ మోడి అర్థం చేసుకోవాలని సూచించారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని లడఖ్, జమ్మూకశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంపైనే ఇమ్రాన్ తన అక్కసును మళ్లీ వెళ్లగక్కారు.

సంబంధిత వర్గం
వందేమాతరం విస్మరిస్తే మనుగడ లేదు : కేంద్ర మంత్రి
వందేమాతరం విస్మరిస్తే మనుగడ లేదు : కేంద్ర మంత్రి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.