(Local) Tue, 10 Dec, 2019

సరిహద్దుల వద్ద పాక్‌ స్పెషల్‌ కమెండోలు

August 28, 2019,   12:00 PM IST
Share on:
సరిహద్దుల వద్ద పాక్‌ స్పెషల్‌ కమెండోలు

కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా మిగిలిపోవడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. అంతేకాకుండా పాకిస్తాన్, అవకాశం దొరికినప్పుడల్లా భారత్ పై రకరకాలుగా అక్కసు వెళ్లగక్కుతోంది. తాజాగా నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద 100 మందికి పైగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమెండోలను పాక్ సైన్యం మోహరింపజేసిందనే విషయాన్ని ఇండియన్ ఆర్మీ గుర్తించింది. పాక్ భూభాగం నుంచి పని చేసే ఉగ్ర సంస్థలతో కలసి ఈ కమెండోలు దాడులకు తెగబడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పాక్ కమెండోల కదలికలపై నిఘా ఉంచామని ఆర్మీ అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, కాల్పులకు తెగబడడంలో ఈ కమెండోలదే ప్రధాన పాత్ర.

 

సంబంధిత వర్గం
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.