(Local) Mon, 23 Sep, 2019

గుజరాత్ తీరంలో కలకలం

August 25, 2019,   12:37 PM IST
Views: 84
Share on:
గుజరాత్ తీరంలో కలకలం

గుజరాత్ తీరంలో పాకిస్థాన్ కు చెందిన పడవలు కలకలం సృష్టించాయి. కచ్ జిల్లాకు సమీపంలోని హరామి నాలా ప్రాంతంలో దాయాది దేశం పాకిస్థాన్ కు చెందిన రెండు మత్స్యకారుల పడవలను శనివారం సరిహద్దు భద్రతా సిబ్బంది గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపించడంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశానికి ఉగ్రముప్పు ఉందని కొంతకాలంగా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంక మీదుగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో గుజరాత్ తీరంలో పాక్ పడవలు కనిపించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

సంబంధిత వర్గం
ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు: కిషన్ రెడ్డి
ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు: కిషన్ రెడ్డి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.