(Local) Thu, 21 Nov, 2019

సట్లేజ్‌ నదిపై ప్రాజెక్టు గేట్లను ఎత్తేసిన పాక్

August 26, 2019,   12:45 PM IST
Share on:
సట్లేజ్‌ నదిపై ప్రాజెక్టు గేట్లను ఎత్తేసిన పాక్

పాకిస్థాన్‌ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే తమ పరిధిలో ఉన్న సట్లేజ్‌ నదిపై ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసింది. దీంతో భారత్‌లోని పంజాబ్‌కి ఒక్కసారిగా వరద ముంచెత్తింది. సట్లేజ్‌ నదీ పరీవాహక ప్రాంతమైన ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని పలు గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. తెండీవాలా గ్రామం వద్ద ఉన్న కరకట్ట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో అప్రమత్తమైన పంజాబ్‌ ప్రభుత్వం ఆదివారం జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది. వెంటనే రంగంలోకి దిగిన జాతీయ విపత్తు స్పందన దళాలు, సైనిక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం పునరావాస కార్యక్రమాలను చేపట్టింది. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామాల్లో సైనిక, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఆదేశించారు.

సంబంధిత వర్గం
టమోటో నగలతో వధువు....
టమోటో నగలతో వధువు....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.