(Local) Mon, 26 Aug, 2019

పాక్ ప్రధాని సంచలన నిర్ణయం

August 08, 2019,   10:17 AM IST
Share on:

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై భారత్ తో ఉన్న వాణిజ్య సంబంధాలు రద్దు చేయాలని,అలాగే భారత్ తో ఉన్న దౌత్య సంబంధాలు సైతం తగ్గించుకోవాలని అధికారులకు సూచించారు. ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన నేడు జాతీయ భద్రత కమిటీ సమావేశం అయ్యింది. జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దులపై సమావేశంలో  చర్చించారు. జమ్మూ కశ్మీర్ పై భారత్ నిర్ణయాన్ని సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ వ్యవహారాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం

సట్లేజ్‌ నదిపై ప్రాజెక్టు గేట్లను ఎత్తేసిన పాక్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.