(Local) Thu, 24 Sep, 2020

గూగుల్ లో 'బికారి'అని టైప్ చేస్తే ఏమి వస్తోందంటే

August 19, 2019,   11:30 AM IST
Share on:
గూగుల్ లో 'బికారి'అని టైప్ చేస్తే ఏమి వస్తోందంటే

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీన్ని అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు యత్నిస్తోన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గూగుల్ లో బికారి అని టైప్ చేసి ఇమేజ్ సెర్చ్ చేస్తే అందులో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటోలు వస్తున్నాయి. దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు నెటిజన్లు. అలా ఎందుకు చూపిస్తుందో గూగుల్ కే తెలియాలని కొందరు అభిప్రాయపడుతుండగా.. తమ వంతుగా డేటా రీచార్జి చేయిస్తామని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత వర్గం
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.