(Local) Tue, 27 Oct, 2020

తీవ్రమైన కడుపునొప్పితో ఎయిమ్స్ లో చేరిన చిదంబరం

October 29, 2019,   11:13 AM IST
Share on:
తీవ్రమైన కడుపునొప్పితో ఎయిమ్స్ లో చేరిన చిదంబరం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని ఎయిమ్స్ కు తరలించారు. తీవ్రమైన కడపు నొప్పితో బాధపడుతున్న చిదంబరాన్ని సోమవారం సాయంత్రం ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం ఈనెల 30 వరకు ఈడీ కస్టడీలో కొనసాగుతారు. మరోవైపు చిదంబరం ఆరోగ్యం పరిస్థితులపై భిన్న ప్రకటనలు వినిపిస్తున్నాయి. చిదంబరం ఆరోగ్య పరిస్ధితి బాగోలేదని, హైదరాబాద్ లో ఆయనకు చికిత్స చేయించేందుకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. మరోవైపు ఆయనను 7 రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు ఇవ్వాలని ఈడీ కోరింది.  

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.