(Local) Sun, 20 Sep, 2020

చిదంబరాన్ని జైలుపాలు చేసేందుకే ఎన్డీయే కుయుక్తులు - ప్రియాంక

August 21, 2019,   2:22 PM IST
Share on:
చిదంబరాన్ని జైలుపాలు చేసేందుకే ఎన్డీయే కుయుక్తులు  ...

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు చిదంబరానికి ప్రియాంక గాంధీ బాసటగా నిలిచారు. చిదంబరం నిజాలు మాట్లాడుతున్నారనే ఎన్డీయే సర్కార్ ఆయన గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తోందని ట్విట్టర్లో మండిపడ్డారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దశాబ్దాల కాలం దేశానికి సేవ చేసిన ఒక సీనియర్ నేత పట్ల అవమానకరంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి చేస్తున్న తప్పులను రాజ్యసభలో మాట్లాడుతుండటం వల్లే.. ఇవన్నీ జీర్ణించుకోలేని ఎన్డీయే .. చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతోందని ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు.

సంబంధిత వర్గం
చిదంబరాన్ని కలిసిన రాహుల్ ,ప్రియాంక
చిదంబరాన్ని కలిసిన రాహుల్ ,ప్రియాంక
చిదంబరం  అరెస్ట్‌కు రంగం సిద్ధం
చిదంబరం అరెస్ట్‌కు రంగం సిద్ధం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.