
ఉల్లి ధరకు రెక్కలు వచ్చాయి. గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేనంతగా దిగుబడి పడిపోవడంతో ధర అమాంతం పెరిగిపోయింది. రెండు వారాల క్రితం రిటైల్ మార్కెట్లో కిలో ధర రూ.24 ఉండగా, ఇప్పుడు రూ.40కి చేరింది. ఢిల్లీ, బెంగుళూరు తదితర మెట్రో నగరాల్లో రూ.44 దాకా పలుకుతోంది. ఉల్లిని అధికంగా పండించే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఇటీవల వరదలు సృష్టించిన బీభత్సమే దీనికి కారణం. అసలే ఈ సీజన్లో పంట తక్కువగా వేయడం, చేతికొచ్చే దశలో పంట పాడవడంతో ఉత్పత్తి భారీగా తగ్గింది. కర్ణాటకలో 40 పంట పూర్తిగా దెబ్బతినగా, మిగిలిన పంట కూడా పనికి రాకుండా పోయిందని రైతు లు అంటున్నారు.
మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి. ఏపీలో ఉల్లి సాగుపై వర్షాభావ ప్రభావం పడింది. తెలంగాణలో పంట చేతికి రావడానికి మరో రెండు నెలల సమయం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి అందుబాటులో లేకుండా పోయింది. ప్రధాన నగరాలకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ నుంచి కొద్దికొద్దిగా సరఫరా అవుతోంది. హైదరాబాద్‌లో క్వింటా రూ.2,500, పుణేలో రూ.2,300, లాసోల్గావ్లో రూ.2,250, జైపూర్‌లో రూ.2,200 అహ్మదాబాద్, రాజ్‌కోట్, ఇండోర్‌లో రూ.2,100, బెంగుళూరులో రూ.1,900 ధర పలుకుతోంది. ఏపీలో రూ.2,400 దాకా చెప్తున్నారు. తరుగు, రవాణా, కూలి ఖర్చులతో హోల్‌సేల్‌గానే క్వింటా రూ.3 వేలు పడుతోంది. దీంతో రిటైల్ వ్యాపారులు కిలో రూ.40 వరకు అమ్ముతున్నారు. పక్షం రోజులుగా ధర క్రమంగా పెరుగుతోంది.
అరబ్ దేశాలతో పాటు సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో ఉల్లికి మంచి గిరాకీ ఉండడంతో పాటు ఉల్లి ఎగుమతులపై కేంద్రం సుంకాన్ని తగ్గించింది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ నుంచి ఆ దేశాలకు ఉల్లి ఎగుమతులు అధికంగానే సాగుతున్నాయి. దీంతో దేశంలో ఉల్లి పాయలకు డిమాండ్ ఏర్పడిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. సెప్టెంబరు కల్లా రిటైల్ ధర రూ.50 దాటే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో 10 రోజుల క్రితం కిలో రూ.24 పలికిన ఉల్లి రిటైల్ దుకాణాల్లో ఇప్పుడు రూ.40కి చేరింది.
రైతు బజార్లలో కిలో రూ.34 చొప్పున అమ్ముతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉల్లి ఉత్పత్తి లేనందున కర్నూలు మార్కెట్‌కు సరుకు రావడానికి మరో నెలన్నర పడుతుందని, అప్పటి దాకా మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు మార్కెట్ యార్డుకు గత సంవత్సరం 1.78 లక్షల క్వింటాళ్లు రాగా, ఈసారి 31 వేల క్వింటాళ్లే వచ్చాయి. సాధారణంగా రబీ కంటే ఖరీఫ్ లోనే అత్యధిక దిగుబడి వస్తుంది. 60-40 శాతాలుగా నమోదయ్యే అధికారిక లెక్కలను పరిశీలించినా గత ఐదేళ్ల కంటే ప్రస్తుత ఖరీఫ్ లో దిగుబడి దిగజారిందనే చెప్పాలి.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.