(Local) Sat, 24 Jul, 2021

ఆయుధ చట్టం మరింత కఠినతరం

November 07, 2019,   2:35 PM IST
Share on:
ఆయుధ చట్టం మరింత కఠినతరం

కేంద్ర ప్రభుత్వం ఆయుధాల అక్రమ తయారీ, అనుమతి లేకుండా విక్రయాలు, అనుమతి లేకుండా వాటిని కలిగి ఉండటం వంటి పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తోంది. వీటిని కట్టడి చేసేందుకు ఆయుధాల చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని భావిస్తోంది. అక్రమ ఆయుధాలతో నేరాలకు పాల్పడేవారికి ప్రస్తుతమున్న మూడేళ్ల కనీస జైలు శిక్షను నేర తీవ్రతను బట్టి ఏడేళ్ల నుంచి జీవిత ఖైదుగా మార్చాలని యోచిస్తోంది. ముఖ్యంగా బహిరంగ, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పుట్టిన రోజు, వివాహ వేడుకల్లో వినోదం కోసం తుపాకులు పేలిస్తే రెండేళ్ల జైలు శిక్ష రూ.లక్ష జరిమానా విధించాలని ప్రతిపాదిస్తోంది. ఈ మేరకు ఆయుధ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నమూనా బిల్లును రూపొందించింది. దీనిపై ఈనెల 18 వరకూ ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టే వీలుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.