(Local) Wed, 20 Oct, 2021

ఊహించని అతిథిని కలిసిన మమతా బెనర్జీ

September 18, 2019,   4:02 PM IST
Share on:
ఊహించని అతిథిని కలిసిన మమతా బెనర్జీ

ప్రధాని మోడీతో భేటీ నిమిత్తం ఢిల్లీ వెళ్లేందుకు  కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మమతకి కాకతాళీయంగా ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ ఎదురుపడ్డారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన పట్ల ఇరువురూ ఆనందించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు వచ్చిన జశోదాబెన్ తన స్వరాష్ట్రం గుజరాత్‌కు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చారు.  

ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఎదురుపడిన వీరిద్దరూ కొద్దిసేపు పరస్పర యోగక్షేమాలు తెలుసుకున్నారు. జశోదాబెన్‌కు మమత సాంప్రదాయ బెంగాలీ చీరను బహుకరించారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు మమత ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలతోపాటు రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని కూడా ఆమె చర్చించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చే ప్రతిపాదనను కూడా ఆమె ప్రధానితో చర్చిస్తారని తెలుస్తోంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీతో ఆమె సమావేశం కావడం ఇదే మొదటిసారి. చివరిగా వారిద్దరూ 2018 మే 24న శాంతినికేతన్‌లోని విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కలుసుకున్నారు.

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.