(Local) Fri, 17 Sep, 2021

ఇక రాజకీయాలు చాలు - గిరిరాజ్ సింగ్

November 18, 2019,   6:55 PM IST
Share on:
ఇక రాజకీయాలు చాలు - గిరిరాజ్ సింగ్

కేంద్రమంత్రి భాజపా నేత గిరిరాజ్‌ సింగ్‌ ఆర్జికల్‌ 370 రద్దు అయోధ్య రామ మందిర నిర్మాణం తన చిరకాల కోరికలని, ఆ రెండూ తీరాయని అన్నారు. ఇక తాను రాజకీయాల నుంచి వైదొలిగే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జనాభా నియంత్రణకు చట్టం తీసుకొచ్చిన రోజు తాను తప్పకుండా ఆ పనిచేస్తానని చెప్పుకొచ్చారు. దేశ జనాభా పెరిగిపోవడానికి ఓ వర్గం ప్రజలే కారణమంటూ ఆయన పలుమార్లు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తూ అసోం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇద్దరు పిల్లల పాలసీని ఈ సందర్భంగా గిరిరాజ్‌ సింగ్‌ కొనియాడారు. దేశ జనాభా పెరుగుదలను రెండో దశ క్యాన్సర్‌తో ఆయన ఓ సందర్భంలో పోల్చారు. 2020 బిహార్‌ ఎన్నికల గురించి ప్రస్తావించగా, నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోనే తమ కూటమి ఎన్నికలకు వెళుతుందని, ఈ విషయాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఇది వరకే స్పష్టంచేశారని గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.