(Local) Fri, 29 May, 2020

ఏపీ రాజధాని అమరావతినే..నో చేంజ్

November 26, 2019,   11:05 AM IST
Share on:
ఏపీ రాజధాని అమరావతినే..నో చేంజ్

గత కొంత కాలంగా ఏపీ రాజధానిని మారుస్తారని వస్తున్న ఊహాగానాలకు సీఎం జగన్ తెర దించారు. సోమవారం రాజధాని నిర్మాణం పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో ప్రభుత్వ నిర్మాణాల సముదాయాలు, భవనాల నిర్మాణాల విషయంలో ఆర్బాటాలకు పోవద్దని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయలన్నారు. రోడ్ల డిజైన్లకు సంబంధించి ప్లానింగ్ లో తప్పులు లేకుండా చూడాలన్నారు. అవసరమైతే ఐఐటీ వంటి ప్రముఖ సంస్థల సలహాలు తీసుకోవాలన్నారు. 

కృష్ణా నది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. వైకుంఠపురం రిజర్వాయర్‌ నిర్మాణం, నీటి వినియోగం వంటి అంశాలపై ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణానికి పోగా మిగిలిన భూమిని సుందరీకరించాలని సూచించారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు.  అన్ని ఖర్చులు తక్కువ చేసుకొని అవసరమైనంత మాత్రమే ఖర్చు పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 

శాసనసభ,సచివాలయం,హైకోర్టు నిర్మాణాల పై నిపుణుల కమిటి నివేదిక అందిన తర్వాత ఆలోచిద్దామని సీఎం జగన్ అన్నారు. గత కొంత కాలంగా ఏపీ రాజధానిగా కర్నూలు లేదా ఇతర ప్రాంతాలను చేయాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ అమరావతి అభివృద్ది పై సీఎం జగన్ ఫోకస్ పెట్టడంతో ఇప్పుడా అనుమానాలకు తెరపడిందని పలువురు చర్చించుకుంటున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.