(Local) Sat, 06 Jun, 2020

పాక్ ఆక్రమిత కశ్మీర్ వెనక్కి తేవడమే లక్ష్యం..!

September 12, 2019,   3:33 PM IST
Share on:
పాక్ ఆక్రమిత కశ్మీర్ వెనక్కి తేవడమే లక్ష్యం..!

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో నిన్న భారత్-పాకిస్థాన్ తమ వాదనలను గట్టిగా వినిపించాయి. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఈరోజు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాకిస్థాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాన్ని వెనక్కి తెచ్చుకోవడమే కేంద్ర ప్రభుత్వ తదుపరి లక్ష్యమని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్ లో పీవోకేను కలపడమే ఇప్పుడు తమ ప్రధాన లక్ష్యమని, ఇది బీజేపీ వ్యక్తిగత అజెండా కాదని... 1994లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పీవోకేను భారత్ లో తిరిగి కలపాలనే తీర్మానానికి పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్ లో నిరంతరం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని పాకిస్థాన్ పై మండిపడ్డారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.