(Local) Sun, 20 Jun, 2021

సోషల్‌ మీడియా నియంత్రణకు నూతన నిబంధనలు

October 23, 2019,   12:53 PM IST
Share on:
సోషల్‌ మీడియా నియంత్రణకు నూతన నిబంధనలు

 సోషల్‌మీడియాలో ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు రుపోందిస్తామని సుప్రింకోర్టుకు తెలియజేసింది. సోషల్‌ మీడియా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించే విషయమై మద్రాస్‌, బొంబాయి, మధ్యప్రదేశ్‌ హైకోర్టులో దాఖలైన కేసులను మొత్తం ఒకే చోటుకు బదిలీ చేయాలని సామాజిక మాధ్యమ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ అంశంపై హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయించింది.సామాజిక మధ్యమాల కార్యక్రలాపాలను నియంత్రించే నిబంధనల గురించి జనవరిలోగా నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం జనవరి 15లోగా కొత్త నిబంధనలు రూపొందిస్తామని వెల్లడించింది. సుప్రీంకోర్టులో దాఖలైన సోషల్‌ మీడియా వ్యాజ్యాలపై 2020 జనవరి చివరి వారంలో విచారణ చేపడుతుందని వెల్లడించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.