(Local) Wed, 20 Oct, 2021

కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ....

September 08, 2019,   6:04 PM IST
Share on:
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ....

రాజ్‌భవన్ వేదికగా నూతన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేతులు మీదుగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు . టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ మంత్రులుగా ఈరోజు సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. మరి కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ శాఖలు కేటాయించనున్నారు అనే విషయంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, కొత్త మంత్రులకు కేసీఆర్‌ శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. 

శాఖలు ఇలా.. 

హరీశ్ రావు – ఆర్థిక శాఖ

జగదీశ్ రెడ్డి – విద్యుత్ శాఖ

కేటీఆర్‌ – మున్సిపల్, ఐటీ, పరిశ్రమలు 

సత్యవతి రాథోడ్ – స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమం

పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి – విద్యాశాఖ

గంగుల కమలాకర్ – బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ

పువ్వాడ అజయ్ కుమార్ – రవాణ శాఖ

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.