(Local) Sat, 24 Jul, 2021

ఏపీ సర్కార్ కు కొత్త తలనొప్పి

November 11, 2019,   12:33 PM IST
Share on:
ఏపీ సర్కార్ కు కొత్త తలనొప్పి

ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిచిపోవడంతో 5 నెలలుగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండా ఉన్నారు. వరదలు తగ్గితే త్వరలో ఇసుక తవ్వకాలు ప్రారంభించనున్నారు. ఇసుక కొరత తీరుతుందనుకున్న సమయాన ఏపీ సర్కార్ కు ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చిపడింది. ఇసుక తవ్వకాలు ప్రారంభం కావడంతో సిమెంట్ కంపెనీలు సిమెంట్ ధరలు పెంచాయి. ఒక్కో సిమెంట్ బస్తా పై సుమారు 25 నుంచి 30 శాతం వరకు ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. మూడు రోజుల వరకు సిమెంట్ బస్తా ధర రూ. 250 నుంచి రూ.270 వరకు ఉండేది. ప్రస్తుతం అది రూ.380కి చేరినట్టు తెలుస్తోంది. పాత స్టాక్ ను కూడా కొత్త ధరలకే అందించాలని  డీలర్లకు కంపెనీలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మరి సర్కార్ సిమెంట్ కంపెనీలతో చర్చించి సిమెంట్ ధరలు తగ్గేలా చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇసుక తవ్వకాలు ప్రారంభం కావడంతో నిర్మాణాలు పెరగనున్నాయి. దీనిని క్యాష్ చేసుకోవడానికి ఉద్దేశ్యపూర్వకంగానే సిమెంట్ కంపెనీలు ధర పెంచినట్టు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.