(Local) Sat, 30 May, 2020

32 జడ్పీలకు కొత్త సీఈవోలు

July 05, 2019,   11:31 AM IST
Share on:
32 జడ్పీలకు కొత్త సీఈవోలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ లకు సీఈవోలను నియమిస్తూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5న కొత్త జిల్లా పరిషత్‌‌ల ఆవిర్భావం, అదే రోజు తొలి సమావేశం ఉన్నందున ఉత్తర్వులు జారీ చేశారు. సీఈవోలుగా పదోన్నతి పొందిన వారిలో ఉమ్మడి జిల్లా పరిషత్ లలో డిప్యూటీ సీఈవోలుగా, డీఆర్డీఏ పీడీ, ఏపీడీ, అకౌంట్ ఆఫీసర్లుగా, ఇతర శాఖలలో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. గురువారం ఇతర శాఖల నుంచి రిలీవ్ అయి 5వ తేదీన విధుల్లో చేరాలని, అందుకు అనుమతి ఇవ్వాలని పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు , జీహెచ్ ఎంసీ కమిషనర్లకు, ప్రమోషన్లు పొందిన అధికారులు పనిచేస్తున్న శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పదవీకాలం ఆగస్టు 4 వరకు ఉంది. ఆ జిల్లా నుంచి నూతనంగా ఏర్పాటైన కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిషత్ లు ఆగస్టు 5న ఏర్పాటు కానున్నాయి. సీఈవోలతో పాటు 32 జిల్లాలకు అకౌంట్ ఆఫీసర్లను కూడా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
జడ్పీ సీఈవోల జాబితా
 
1.డి వేణు                 –        ఆదిలాబాద్
 
2.కే. నరేందర్         –             మంచిర్యాల
 
3.ఎం. సుధీర్           -       నిర్మల్
 
4.ఎస్ కిషన్              –          ఆసిఫాబాద్
 
5.వెంకట మాధవ రావు–    కరీంనగర్
 
6 .ఏ. శ్రీనివాస్          –           జగిత్యాల
 
 
7.ఎం. శ్రీనివాస్        –            పెద్దపల్లి
 
 8.బి. గౌతం రెడ్డి-         –        సిరిసిల్ల
 
9.ఐ. గోవింద్            –            నిజామాబాద్
 
10.జి. కాంతమ్మ       –         కామారెడ్డి
 
11.ఎస్ . ప్రసూన రాణి –      వరంగల్ అర్బన్
 
12.ఏ. రాజారావు      –         వరంగల్ రూరల్
 
13.డి. శీరిష                  –       భూపాలపల్లి
 
14.ఏ. పారిజాతం      –          ములుగు
 
15.టి.రమాదేవి          –        జనగాం
 
16.ఆర్ సన్యాసయ్య      –    మహబూబాబాద్
 
17.చెక్క ప్రియాంక        –     ఖమ్మం
 
18.మధుసూధన్ రావు   –      కొత్తగూడెం
 
19.టి. రవి                   –                 మెదక్
 
20.ఎం. లక్ష్మీ బాయి         – సంగారెడ్డి
 
21.బి. శ్రావణ్ కుమార్    –   సిద్దిపేట
 
22.బి. వసంతకుమారి    –   మహబూబ్ నగర్
 
23.పి. నర్సింహులు        –   వనపర్తి
 
24.కే. నాగమణి-               –  నాగర్ కర్నూలు
 
25.ఎం. జ్యోతి –     గద్వాల
 
26.ఎం. కాలిందిని            –     నారాయణపేట
 
 27.కే.వీరబ్రహ్మ చారి    –      నల్గొండ
 
28.ఎల్. విజయ లక్ష్మి       – సూర్యాపేట
 
29.సీహెచ్. కృష్ణారెడ్డి      –     భువనగిరి
 
30.జి. జితేందర్ రెడ్డి     –      రంగారెడ్డి
 
31.సి. శ్రీకాంత్ రెడ్డి       –      వికారాబాద్
 
32. బి. దేవసహాయం – మేడ్చల్

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.