(Local) Wed, 20 Oct, 2021

ఎన్నాఆర్సీ తుట్టె కదిలించారు...

November 28, 2019,   1:56 PM IST
Share on:
ఎన్నాఆర్సీ  తుట్టె కదిలించారు...

మూడు దశాబ్దాల క్రితం బిజెపికి అసోంలో బలం శూన్యం. కాని 2016
వచ్చేనాటికి బిజెపి అసోంలో చరిత్ర సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలకు
ముందు బిజెపి అసోంలో గెలుపు సాధించడానికి అసోం ఉద్యమాన్ని    ఉపయోగించుకుంది. అసోంలో చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఎప్పటి 
నుంచో ఆందోళన కొనసాగుతోంది. చొరబాటుదారుల సమస్యపైనే బిజెపి
ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళగలిగింది. చివరకు బిజెపి నాయకుడు సర్భానంద
సోనోవాల్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ప్రభుత్వం ఏర్పాటయ్యింది. అసోంలో
సోనోవాల్‌ హీరోగా మారిపోయారు. అసోంలోని విదేశీయులను
బయటకు గెంటేస్తామని, కాంగ్రెస్‌ మాదిరిగా బుజ్జగింపు రాజకీయాలు
చేసేది ఉండదని హామిలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో
చొరబాటుదారులు, అస్సాం చరిత్ర తవ్చ మరో అంశం ఏదీ ప్రస్తావనకు
రాలేదని చెప్పాలి. ఎన్నికల పోరాటాన్ని సరాయీఘాట్‌ యుద్ధంతో
సర్భానంద పోల్చాడు . 17వ శతాబ్ధంలో జరిగిన యుద్ధం సరాయీఘాట్‌
మొగల్‌ సైన్యాలను అహోం సైన్యాలు ఓడించిన యుద్ధం అది.
లచ్చిత్‌ బోర్భుఖాన్‌ నాయకత్వంలో అహోం సైన్యం సాధించిన
విజయమది.అసోం ఎన్నికలు ముగిసిన మూడున్నరేళ్ళ తర్వాత జాతీయ
పౌర జాబితా విడుదలైన తర్వాత బిజెపి ఆశలపై చన్నీళ్ళు పడ్డాయి.
అసోం నుంచి అక్రమ ప్రవాసులను  గుర్తించి బయటకు
పంపించేయడానికి ఉద్దేశించిన ఎన్‌ఆర్‌సి పూర్తయ్యింది. ఆగష్టు 2019లో ప్రచురించడం కూడా జరిగిపోయింది.ఎన్‌ఆర్‌సి తర్వాత కేవలం 19 లక్షల మంది మాత్రమే విదేశీయులని తేలింది. కానీ, బిజెపి ఇంత వరకు 40 లక్షల మంది విదేశీయులు అసోంలో ఉన్నారని చెబుతూ వచ్చింది. బిజెవి చెప్పిన సంఖ్య కన్నా ఇది సగం కన్నా తక్కువ. ఇప్పుడు అసోం ఆర్థిక మంత్రి హిమాంత బిస్వా శర్మ సరికొత్తగా మళ్ళీ ఎన్‌ఆర్‌సి కనరత్తు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ఇప్పుదు ప్రచురించిన ఎన్‌ఆర్‌సి బుట్టదాఖలు చేసి, సరికొత్తగా మళ్ళీ మొత్తం కసరత్తు చేయాలంటున్నాడు. ఆయన ఈ మాటలు చెప్పిన రోజునే కేంద్ర హోం మంత్రి రాజ్యసభలో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి అమలు చేస్తామని, అసోంలో సరికొత్తగా ఎన్‌ఆర్‌సి మళ్ళీ చేపడతామని చెప్పారు. ఎన్‌ఆర్‌సి కోసం ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేసిన బిజెపి, ఎన్‌ఆర్‌సి వచ్చిన తర్వాత నిరుత్సాహపడడానికి
కారణమేమిటి?

దేశ స్వాతంత్ర వచ్చిన తర్వాతి నుంచి అక్రమ ప్రవాసుల నమస్య అసోంను కుదిపేస్తోంది. 1979లో ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ పెద్ద ఉద్యమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని అక్రమ ప్రవాసులను గుర్తించి బయటకు పంపేయాలనే డిమాండ్‌ తో ఈ ఉద్యమం నడిచింది. ఆరేళ్ళ పాటు ఈ ఉద్యమం నడిచిన తర్వాత  1985 ఆగష్టు 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం, అసోం రాష్ట్రప్రభుత్వం, అస్ఫాం స్టూడెంట్స్‌ యూనియన్‌ మధ్య ఒవ్చందం కుదిరింది. బంగ్లాదేశ్‌ యుద్ధం తర్వాత వచ్చిన ప్రవాసులకు 1971 మార్చి 24 కటాఫ్‌ తేదీగా అంగీకరించారు. కాని అసోంలోని ప్రాంతీయ పార్టీ అస్సాం గణపరిషద్‌, అసోంను తర్వాత పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏవి కూడా అసోం ఒప్పందాన్ని అమలు చేసే అసక్తి చూపించలేదు. ముస్లిం ఓట్లు దూరమవుతాయని భయపడ్డారు. అస్సాం పబ్లిక్‌ వర్క్‌ అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటీషనుపై చివరకు సుప్రీంకోర్టు 2013లో ఎన్‌ఆర్‌సి ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. 2015 డిసెంబర్‌ 31వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని గడువు కూడా విధించడం జరిగింది. అయితే ఎన్‌ఆర్‌సి
ప్రక్రియ 2015 ఫిబ్రవరిలో మాత్రమే ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగింది. ఆ తర్వాతి సంవత్సరం అసోంలో
బిజెపి అధికారంలోకి వచ్చింది. 2017 డిసెంబర్‌ 31వ తేదీన మొదటి
ప్రతి ప్రచురించడం జరిగింది. 2018 జులై 30 వ తేదీన రెండవ ప్రతి
ప్రచురించడం జరిగింది. దీని ప్రకారం 40 లక్షల మంది
అనుమానితులను గుర్తించారు. ఈ ప్రక్రియ తర్వాత బిజెపి వాదన
కొద్దిగా మారింది. బెంగాలీ మాట్లాడే ముస్లింలను విదేశీయులుగా బెంగాలీ భాష మాట్లాడే హిందువులను శరణార్థులుగాను వర్ణించడం ప్రారంభించింది. కాబట్టి శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలనే వాదన ముందుకు వచ్చింది. కాని ఆగష్టు 31వ తేదీన తుది ప్రతి విడుదలయ్యింది.తుది జాబితా ప్రకారం కేవలం 19
లక్షల మంది మాత్రమే అక్రమ 'ప్రవాసులుగా లెక్క తేలింది.

ఈ జాబితాలో అనేక మంది హిందువుల పేర్లు కూడా లేవు. ఇందులో చాలా
మంది బెంగాలీలు. బిజెపికి ఓటు బ్యాంకుగా ఉన్నవారు కూడా చాలా
మంది ఉన్నారు. ఈ జాబితా ప్రచురించిన ఒక నెల లోపునే హేమంత
బిస్వా శర్మ మాట్లాడుతూ పొరుగు దేశంలో అణచివేతల వల్ల దేశంలో
శరణు కోరిన రెండు మూడు లక్షల మంది హిందువులను శత్రువులుగా
భావిస్తామా? బెంగాలీ హిందువులు దీనివల్ల చాలా  అందోళన
చెందుతున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ నుంచి
కూడా  ఒక ప్రకటన వచ్చింది. జాబితాలో పేరు లేనంత మాత్రాన
విదేశీయుడిగా ప్రకటించడం జరగదని వివరణ వచ్చింది.ఎన్‌ఆర్‌సి తుది
ప్రతి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంకు బెంగాలీ
హిందువులకు ఆగ్రహం కలిగించేదిగా ఉంది. అందువల్లనే ఎన్‌ఆర్‌సిని
బిజెపి తిరస్కరిస్తోంది . అసోంలో బిజెపి రాజకీయాలను పరిశీలిస్తే, 15వ
శతాబ్దానికి చెందిన శంకరదేవ్‌ అనే హిందూ సాధువు పేరును
వాడుకోవడం ప్రారంభించారు. శిబ్‌ సాగర్‌ లో శ్రీమంత శంకరదేవ
సంగా 85వ సమావేళానికి 2016లో ప్రధాని నరేంద్ర మోడీ
హాజరయ్యారు. అసోంకు  ఒకప్పుడు శిబ్‌ సాగర్‌ రాజధానిగా ఉండేది.
అక్రమ వ్రవాసుల వల్ల శంకరదేవ్‌ సంప్రదాయాలు, వారసత్వం నాశనమవుతున్నాయని  బిజెపి ప్రచారం ప్రారంభించింది. అసోంలో
ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఇదే ప్రచారం  కొనసాగించింది. అక్రమ ప్రవాసులు
అసోంలో పౌరసత్వ పత్రాలు సంపాదించుకుని దేశమంతా
విస్తరిస్తున్నారని ప్రచారం మొదలైంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.