(Local) Tue, 20 Oct, 2020

జగన్ ఇంగ్లీష్ లో మాట్లాడితే ....

November 11, 2019,   2:58 PM IST
Share on:
జగన్ ఇంగ్లీష్ లో మాట్లాడితే ....

జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో  ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ..సిఎం జగన్‌ ఇంగ్లిషులో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయని మరి అదే  నారా వారు ఇంగ్లిషులో ఎలా మాట్లాడతారో మనం తెలుసునని , ‘బ్రీఫ్డ్ మీ’ అంటరాని గుర్తు చేశారు. అప్పట్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి, స్టీఫెన్‌సన్, చంద్రబాబు నాయుడు మధ్య ‘బ్రీఫ్డ్ మీ’ సంభాషణ కలకలం రేపిన విషయం తెలిసిందే. కమిషన్ కోసం రూ.వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అంజాద్‌ బాషా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లిష్ మీడియంలో బోధనను అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. దీనిపై చాలా మంది విమర్శలు చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రోజునే అభివృద్ధి సాధ్యమని, తమ సర్కారు సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. మైనారిటీలకూ మంచి విద్య అందిస్తామని చెప్పారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.