(Local) Sun, 20 Jun, 2021

విక్రమ్ ల్యాండర్ జాడ తెలిసింది..!

September 29, 2019,   12:02 PM IST
Share on:
విక్రమ్ ల్యాండర్ జాడ తెలిసింది..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్‌కు బదులు బలంగా కూలిపోయిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నిర్ధారించింది.విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టేందుకు నాసా... ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్‌ (LRO)ను రంగంలోకి దింపిందని మనకు తెలుసు. రెండు పగులు లోయల మధ్యలోని మైదాన ప్రాంతంలో కూలిపోయిన ల్యాండర్‌ను కనిపెట్టేందుకు LRO సెప్టెంబర్ 27న ప్రయత్నించి విఫలమైంది. ఎందుకంటే... విక్రమ్ ల్యాండర్ చీకటి ప్రాంతంలో పడింది. నాసా అప్‌లోడ్ చేసిన మూడో ఫొటో మ్యాప్ ద్వారా ఆ విషయం మనకు అర్థమవుతుంది. అది ఎంత పెద్ద ఫొటో అంటే... 2GB ఉంది. ఇందులో పిక్సెల్‌కి 1.25 మీటర్ల రిజల్యూషన్ ఉంది. దాన్ని డౌన్‍‌లోడ్ చేసుకోవచ్చు. మనమే ఇంచు ఇంచు వెతకొచ్చు. బట్... విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిందో అందులో నాసా క్లియర్‌గా చెప్పింది. ఆ ప్రదేశంలో అంతా చీకటి తప్ప ఏమీ లేదు.ప్రస్తుతం ల్యాండర్ కూలిన చోట వెలుతురు లేదు కాబట్టి... అక్టోబర్‌లో మళ్లీ సూర్యకాంతి పడినప్పుడు... LRO ద్వారా వెతికిస్తామని ఇస్రో తన ప్రకటనలో తెలిపింది.

విక్రమ్ ల్యాండర్ ఫోటోను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
http://lroc.sese.asu.edu/posts/1128

సంబంధిత వర్గం
లోక్‌సభలో చంద్రయాన్‌-2 పై ఆసక్తికర చర్చ
లోక్‌సభలో చంద్రయాన్‌-2 పై ఆసక్తికర చర్చ
విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఫోటోలను పంపిన నాసా
విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఫోటోలను పంపిన నాసా

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.