(Local) Sun, 20 Jun, 2021

విక్రమ్ కోసం రంగంలోకి నాసా

September 13, 2019,   3:11 PM IST
Share on:
విక్రమ్ కోసం రంగంలోకి నాసా

జాబిల్లి ఉపరితలంపై ఉలుకూపలుకూ లేకుండా ఉన్న 'విక్రమ్'
ల్యాండర్ తో  సంబంధాలు ఏర్పరచుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధన
 సంస్థ (ఇస్రో) చిట్ట చివరి ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా
అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా'ను రంగంలోకి దించింది. మన ల్యాండర్ తో  అనుసంధానమయ్యేందుకు ఆ సంస్థ సంకేతాలను పంపుతోంది. నాసాకు చెందినజెట్ ప్రొపల్షన్  లేబొరేటరీ (జేపీఎల్) తన డీప్ స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్)లోని భూ కేంద్రాల ద్వారా విక్రమ్కు  రేడియో తరంగాలను పంపింది. దక్షిణ కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్, స్పెయిన్లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో ఉన్న నాసా డీఎస్ఎన్ కేంద్రాల నుంచి 12 కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను జాబిల్లి మీదకు ప్రసరింపచేస్తోంది.భూ కేంద్రంతో కమ్యూనికేషన్ సాగించేలా ల్యాండర్ ను  ప్రేరేపించడం దీని ఉద్దేశం. సుదూరపు విశ్వంలోని వ్యోమనౌకలు కనీసం ఏదో ఒక కేంద్రంతో సంబంధాలను కొనసాగించేలా చూడటం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు సౌర కుటుంబం అంచులవరకూ కమ్యూనికేషన్
సాగించగలవు. ఆ కేంద్రాల్లోని భారీ యాంటెన్నాలతో ఏకకాలంలో అనేక
వ్యోమనౌకలతో కమ్యూనికేషన్ ను సాగించవచ్చు. మరోపక్క రోజులు
గడిచేకొద్దీ ల్యాండర్ పునరుద్దరణ అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి.
జాబిల్లపై 14 రోజుల పగటి సమయం ఈ నెల 20-21తో ముగుస్తుంది. ఆ
తర్వాత విక్రమ్లోని  సౌరఫలకాలకు శక్తి అండదు. ఆ పరిస్థితుల్లో
వ్యోమనౌకపై ఆశలు వదులుకోవాల్సిందే.

సంబంధిత వర్గం
ఇస్రో పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం సక్సెస్
ఇస్రో పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం సక్సెస్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.