(Local) Wed, 21 Oct, 2020

ఇసుక వారోత్సవాల పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు

November 26, 2019,   10:23 AM IST
Share on:
ఇసుక వారోత్సవాల పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఇసుక వారోత్సవాల పై వ్యంగ్యాస్త్రాలు చేశారు. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ ట్వీటుతూ …"ఇసుక వారోత్సవాలు అని జగన్ గారు అంటే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డాను. జగన్ గారు అన్నది ఇసుక 'వార్' ఉత్సవాలు అని తరువాత అర్థం అయ్యింది. ఇసుక వార్ లో భాగంగా ఇసుక వాటాల కోసం వైసీపీ నాయకులు కర్రలతో దాడులు చేసుకొని, తలలు పగలు కొట్టుకుంటున్నారు. ఒక పక్క వైసీపీ నాయకులు ఇసుకలో వాటాల కోసం వీధి రౌడీల్లా కొట్టుకుంటుంటే అదే గుంటూరు జిల్లా, పెదకాకానిలో జగన్ గారి చేతగాని పాలనకి మరో భవన నిర్మాణ కార్మికుడు పీట్ల శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు . వైసీపీ ఇసుక వార్ ఉత్సవాలు, ఇసుక పంచాయితీలు ఆపి కార్మికులకు బతుకు భరోసా ఇవ్వండి జగన్ గారు." అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

సంబంధిత వర్గం
రాజధాని రైతుల్లో ఆనందం
రాజధాని రైతుల్లో ఆనందం
జగన్ రెడ్డి గారు మోడీ మాట విన్నారా ..? - పవన్ కళ్య ...
జగన్ రెడ్డి గారు మోడీ మాట విన్నారా ..? - పవన్ కళ్య ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.