(Local) Sun, 20 Jun, 2021

నాగార్జున సాగర్‌ 16 గేట్లు ఎత్తివేత

September 10, 2019,   12:10 PM IST
Share on:
నాగార్జున సాగర్‌ 16 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం నుంచి వస్తున్న వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతూ ఉండటంతో, నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను అధికారులు తెరిచారు. ఈ ఉదయం 2.60 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటం, నీటిని నిల్వ చేసే వీలు లేకపోవడంతో 16 గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తిన అధికారులు 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ గేట్లు ఎత్తగానే, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశామని అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలను ముంపు ప్రాంతానికి పంపామని తెలిపారు.కాగా, ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 80 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, నేటి సాయంత్రానికి అది 3 లక్షల క్యూసెక్కులను దాటే ప్రమాదం ఉండటంతో, ఉండవల్లి, కరకట్ట మరోసారి ముంపు ప్రమాదంలో చిక్కుకుంది. వరదను దృష్టిలో ఉంచుకుని, భవానీ ద్వీపానికి యాత్రికుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

సంబంధిత వర్గం
నాగార్జున సాగర్ 18 గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్ 18 గేట్లు ఎత్తివేత
ఉధృతంగా గోదావరి.. జల దిగ్బందంలో గ్రామాలు
ఉధృతంగా గోదావరి.. జల దిగ్బందంలో గ్రామాలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.