(Local) Sat, 24 Jul, 2021

'నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు'.... మమతా బెనర్జీ

November 03, 2019,   5:10 PM IST
Share on:
'నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు'.... మమతా బెనర్జీ

రాజకీయాల్లో చాల ఎక్కువగా వినిపించే విషయం ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం వినిపించే సంగతి. అయితే తాజాగా నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అని ఓ ముఖ్యమంత్రి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి తనకు వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయని తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్వయంగా తానే ప్రధాని నరేంద్ర మోడీని కోరుతానని చెప్పారు. దేశంలో ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతుంటే కనీసం మాట్లాడే స్వేచ్ఛ ఎలా ఉంటుందని మోడీ సర్కార్ ను ప్రశ్నించారు. ప్రజలు ఫోనులో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకపోతే దేశంలో స్వాతంత్ర్యం ఉన్నట్లేనా? అని మమతా నిలదీశారు. కేంద్ర ప్రభుత్తం ఇప్పటికే చాలా సార్లు తన ఫోన్ ను ట్యాప్ చేయించిందన్నారు. అందుకు తగ్గ ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆమె అన్నారు. అంతేకాకుండా మరో మూడు రాష్ట్రాలు కూడా తన ఫోనును ట్యాప్ చేసేందుకు పని చేశాయని దీదీ ఆరోపించారు. ఆ రాష్ట్రాల పేర్లును తాను బయట పెట్టనని ఆమె చెప్పారు.

సంబంధిత వర్గం
బీజేపీ అభ్యర్థిని కాలితో తన్నిన కార్యకర్తలు
బీజేపీ అభ్యర్థిని కాలితో తన్నిన కార్యకర్తలు
గంగూలీ ని మెచ్చకున్న మమతా
గంగూలీ ని మెచ్చకున్న మమతా

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.