(Local) Wed, 23 Sep, 2020

మోదీ కోసం ముస్లిం మహిళల ప్రత్యేక రాఖీలు..

August 12, 2019,   12:05 PM IST
Share on:
మోదీ కోసం ముస్లిం మహిళల ప్రత్యేక రాఖీలు..

ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళలు ఇంతకాలం ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. వారి హక్కులను కాపాడేందుకు, వారికి సరైన జీవితాన్ని అందించేందుకు మోదీ సర్కారు ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసింది.ప్రధాని మోడీకి వారణాసి ముస్లిం మహిళలు తాము సొంతంగా తయారుచేసిన రాఖీలను పంపించారు. మోడీ తమకు పెద్దన్న లాంటివారని, శతాబ్దాలుగా కొనసాగుతున్న తమ మతంలోని దురాచారాన్ని రూపు మాపి తమకు ఎంతోమేలుచేసారని, తమ జీవితాల్లో వెలుగులునింపారని అన్నారు. మా అన్నకోసమే మేం రాఖీలు తయారుచేసామని చెప్పారు.

అయితే ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ మాత్రం ఇదంతా ప్రచార ప్రహసనమేనని కొట్టి వేసింది. ఆర్‌ ఎస్‌ఎస్‌లోని ముస్లింవిభాగం ఇలాంటి కార్యకలాపాలు చేస్తోందని, ముస్లింలను కిరాయికి తీసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, అధికారంలో ఉన్న నేతల ఒత్తిడివల్లనే ఇలా చేస్తున్నారని, ఇది ప్రభుత్వ ప్రచారంలో భాగమేనని ఐఎంఎంఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాతిన్‌ఖాన్‌ ఆరోపించారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.