(Local) Sat, 10 Apr, 2021

ఇక కాశ్మీరు పర్యవేక్షణ సులభం -బిపిన్‌ రావత్‌

November 07, 2019,   2:21 PM IST
Share on:
ఇక కాశ్మీరు పర్యవేక్షణ సులభం -బిపిన్‌ రావత్‌

భారత సైన్యాధ్యక్షుడు జనరల్‌ బిపిన్‌ రావత్‌  దేశ సమైక్యతా యాత్రలో భాగంగా దిల్లీకి వచ్చిన కశ్మీర్‌లోని రజారీ, రియానీ సెక్టార్‌ ప్రాంతాలకు చెందిన మతపెద్దలు, పండితులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జమ్మూకాశ్మీరును కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినందున ఇక ఆ ప్రాంతంలో పరిస్థితులను పర్యవేక్షించడం సులభమని తెలిపారు. ఈ ప్రాంతం  పూర్తిగా కేంద్రం అధీనంలోకి వచ్చినందున రాష్ట్ర కేంద్ర బలగాలు మరింత సమన్వయంతో పనిచేసే అవకాశం ఏర్పడిందన్నారు. సైన్యం ఎప్పుడూ ఒంటరిగా పనిచేయదని, రాష్ట్ర కేంద్ర బలగాలతో పాటు స్థానిక నాయకుల సహకారంతోనే శాంతి భద్రతల స్థాపన సాధ్యమవుతుందని చెప్పారు. లోయలో శాంతి నెలకొనేలా పనిచేయాలని వారికి సూచించారు. కశ్మీర్‌లో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి ఉంటున్నారనడానికి ఈ యాత్రే ఓ నిదర్శనమన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.