(Local) Sun, 20 Oct, 2019

మోడీ పాకిస్థాన్‌ను హద్దుల్లో ఉంచారు: హోం మంత్రి అమిత్‌షా

September 19, 2019,   11:50 AM IST
Share on:
మోడీ పాకిస్థాన్‌ను హద్దుల్లో ఉంచారు: హోం మంత్రి అమ ...

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జార్ఖండ్‌లోని జంతరలో బుధవారంనాడు నిర్వహించిన జోహర్ జన్ ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370, 35ఏ అధికరణలను రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ పాకిస్థాన్‌ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని, భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. 370 అధికరణకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తన వైఖరి ఏమిటో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో రాహుల్ పర్యటించేటప్పుడైనా 370 అధికరణపై తన వైఖరి ఏమిటో ప్రజలకు చెబితే బాగుంటుందని అన్నారు. తాము సర్జికల్ దాడులు జరిపినప్పుడు రాహుల్ వ్యతిరేకించారని, వాయు దాడులు జరిపితే సాక్ష్యాలు అడిగారని, దేశాన్ని ఏ దిశగా నడపాలని ఆయన అనుకుంటున్నారో ప్రజలకు ఇప్పుడైనా వివరణ ఇవ్వాలని అమిత్‍షా నిలదీశారు.

సంబంధిత వర్గం
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.