(Local) Fri, 17 Jan, 2020

మోడీ, అమిత్ షాలపై సూపర్ స్టార్ ప్రసంసల వర్షం

August 11, 2019,   5:52 PM IST
Share on:
మోడీ, అమిత్ షాలపై సూపర్ స్టార్  ప్రసంసల వర్షం

ప్రధాని మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసంసల వర్షం కురిపించారు. వీరిద్దరూ కృష్ణార్జునుల వంటివారని రజనీ చెప్పారు. మోడీ ఏదైనా చెబితే, దాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా అమిత్ షా కృషి చేస్తారని కొనియాడారు. కశ్మీర్ అంశంపై వారిద్దరి వైఖరి, ఆర్టికల్ 370లను రజనీకాంత్ ప్రస్తావించారు. ఈ విషయంలో తనకెంతో సంతోషం కలిగిందన్నారు. వారిద్దరూ కలిసి కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడంలో విజయవంతం సాధించారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందన్నారు. అమిత్ షా పార్లమెంట్ లో 370 బిల్లుపై అద్భుతంగా ప్రసంగించారని తలైవా పొగడ్తలు కురిపించారు.

సంబంధిత వర్గం
సీనియర్‌ హీరోయిన్‌ తో తలైవర్ రొమాన్స్‌..
సీనియర్‌ హీరోయిన్‌ తో తలైవర్ రొమాన్స్‌..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.