(Local) Sun, 20 Jun, 2021

నేడు విశాఖలో జనసేన లాంగ్‌మార్చ్‌...

November 03, 2019,   12:52 PM IST
Share on:
నేడు విశాఖలో జనసేన లాంగ్‌మార్చ్‌...

ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జాసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక సంక్షోభానికి లాంగ్‌మార్చ్‌ చేయనున్నారని తెలిసిందే. నేడు విశాఖపట్నంలో మధ్యాహ్నం 3 గంటలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో లాంగ్‌మార్చ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇసుక సంక్షోభానికి నిరసనగా, భవన నిర్మాణ కార్మికులకు బాసటగా జనసేన పార్టీ లాంగ్‌మార్చ్‌ నిర్వహించతలపెట్టింది. మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి మొదలుకొని సెంట్రల్‌ పార్క్‌ వరకు లాంగ్‌ మార్చ్‌ కొనసాగనుంది. అనంతరం సెంట్రల్‌ పార్క్‌ వద్ద జరిగే బహిరంగ సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించనున్నారు. లాంగ్‌మార్చ్‌ విజయవంతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. జనసేన పార్టీ లాంగ్‌మార్చ్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వనుంది. 

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.