(Local) Sun, 20 Oct, 2019

కులవృత్తులను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది

September 16, 2019,   2:25 PM IST
Share on:
కులవృత్తులను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్ కే దక్కుతు ...

తెలంగాణలో అంతరించిపోతున్న కులవృత్తులను సిఎం కెసిఆర్ పునరుద్ధరించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసెంబ్లీలో వెల్లడించారు. కుల వృత్తులను పునరుద్ధించడం ద్వారా రాష్ట్రంలో ఆయా కులాల వారు ఆనందంతో ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. గుడుంబా తయారీ వదులుకున్న వారికి ఉపాధి కల్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలంలో 109 మందికి ఉపాధి కల్పించామని ఆయన వెల్లడించారు. సమైక్య పాలనలో గీత కార్మికులను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రమాదవశాత్తు చనిపోయే గీత కార్మికుల కుటుంబాలు రూ.5 లక్షల నష్టపరిహారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది తాటి, ఈత చెట్లను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?
ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?
ప్రజలు రోగాలతో అల్లాడుతున్నారు: భట్టి
ప్రజలు రోగాలతో అల్లాడుతున్నారు: భట్టి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.