(Local) Sun, 20 Sep, 2020

దేవినేనిపై మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు

August 04, 2019,   12:22 PM IST
Share on:
దేవినేనిపై మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు

మాజీ మంత్రి దేవినేనిపై మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవి పోయినా మదం మాత్రం దిగలేదని, జనం ఛీకొట్టినా గ్రాము కొవ్వు కూడా దిగేలదని దేవినేనిపై నాని ఫైరయ్యారు. దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. అమరావతిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. పోలవరం ప్రాజెక్ట్ పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించడంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌పై పదేళ్ల పాటు ఉన్న హక్కును వదులుకుని అర్ధరాత్రి మూటముల్లె సర్దుకుని తండ్రికొడుకులిద్దరూ బెజవాడ వచ్చారని ఎద్దేవా చేశారు. ఆరునూరైనా మచిలీపట్నం పోర్ట్ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అమెరికాలో నెలన్నరపాటు జల్సాలు చేసొచ్చారని ఇవాళ అసత్యాలు మాట్లాడుతున్నారని నాని మండిపడ్డారు.

సంబంధిత వర్గం
జగన్‌పై నెగ్గిన చంద్రబాబు పంతం..?
జగన్‌పై నెగ్గిన చంద్రబాబు పంతం..?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.