(Local) Mon, 27 Sep, 2021

మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలకు జరిమానా

September 24, 2019,   10:38 AM IST
Share on:
మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలకు జరిమానా

తెలంగాణ రాష్ట్ర మంత్రుల కార్లు రోడ్ల పై అతి వేగంగా దూసుకెళ్తున్నాయి. మితిమీరిన వేగంతో వెళ్తూ వారు పోలీసు కెమెరాలకు చిక్కారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాలకు వెళ్లాలంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వారు ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ సమయంలో వారి వాహన వేగం 100 కిలోమీటర్లు దాటుతుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు మంత్రుల కార్లకు కూడా జరిమానా వేశారు. మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావుల పేరు మీద రూ.9315 జరిమానా ఉంది. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా పోలీసులు జరిమానా విధించారు. మంత్రులకు జరిమానా విధించిన పోలీసులను అంతా అభినందిస్తున్నారు. చట్టం ముందు అంతా సమానమేనని ..,మంత్రులు ఇకనైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?
ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు...
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.