(Local) Thu, 29 Oct, 2020

చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్

November 26, 2019,   8:09 PM IST
Share on:
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు.. అసలు ఏం చూడటానికి వస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన లోటు వచ్చే ఐదేళ్ల వరకు కూడా పూడ్చలేమని, రాష్ట్రాన్ని మొత్తం ఆర్థికంగా దెబ్బతీశారని మండిపడ్డారు. వేల కోట్ల అప్పులు చేసి ఖర్చులు పెట్టిన చంద్రబాబు.. ఏ సంపద సృష్టించారని ఫైర్ అయ్యారు. రాజధానిని దేవాలయంలా భావిస్తే ఎందుకు డెవలప్ చేయలేదన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భవనాల నిర్మాణం చేపట్టకుండా ఏం చేశారని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానంటున్న చంద్రబాబును అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. రాజధానిపై కమిటీ నివేదిక తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.