(Local) Wed, 21 Oct, 2020

కేయూలో ఉద్రిక్తత, లాఠీ ఛార్జ్

November 28, 2019,   9:48 AM IST
Share on:
కేయూలో ఉద్రిక్తత, లాఠీ ఛార్జ్

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిగ్రీ సిలబస్ పూర్తికాకముందే సెమిస్టర్ పరీక్షులు నిర్వహించడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని బుధవారం ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. 90రోజుల షెడ్యూల్ పూర్తి కాకముందే, క్లాసులు పూర్తిగా జరగక ముందే ఎగ్జామ్స్ నిర్వహించడంతో విద్యార్థులు యూనివర్సిటీ రిజిస్టర్‌ చాంబర్‌ ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు. ప్రస్తుతం యూనివర్సిటీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.