(Local) Sat, 24 Jul, 2021

అంతరిక్షంలో అరుదైన దృశ్యం...

November 11, 2019,   3:48 PM IST
Share on:
అంతరిక్షంలో అరుదైన దృశ్యం...

సోమవారం అంతరిక్షంలో అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే బుధగ్రహం సూర్యున్ని దాటి వెళ్లనుంది. ఈ క్ర‌మంలో ఆ గ్ర‌హం మ‌న‌కు సూర్యునిపై చిన్న మ‌చ్చ‌లా క‌నిపించ‌నుంది. ఒక శతాబ్దంలో ఇలాంటి అరుదైన సంఘటనలు 13 సార్లు జరిగేందుకు అవకాశం ఉంటుందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటన మళ్లీ 2032లోనే జరుగుతుందని వారు తెలిపారు. ఇక ఈ దృశ్యాన్ని దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఐరోపా, ఆఫ్రికాలలోని పలు ప్రాంతాల్లో ఉన్న వారు వీక్షించవచ్చని నాసా తెలిపింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.05 నిమిషాలకు బుధ గ్రహం సూర్యుని మీదుగా వెళ్తుందని, ఈ క్రమంలో అంతరిక్షంలో సుమారుగా ఐదున్నర గంటల పాటు ఆ దృశ్యాన్ని వీక్షించవచ్చని సైంటిస్టులు తెలిపారు. ఇక ఆ దృశ్యాన్ని వీక్షించలేని వారు నాసా వెబ్‌సైట్‌లో ప్రసారమయ్యే లైవ్ స్ట్రీమ్‌ను వీక్షించవచ్చని వారు చెప్పారు. కాగా ఆ దృశ్యం మన దేశంతోపాటు ఆసియాలోని ఇతర దేశాలు, ఆస్ట్రేలియా, అలస్కా దేశ వాసులకు కూడా కనిపించదని సైంటిస్టులు తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.