(Local) Mon, 17 Feb, 2020

ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ముఫ్తీ

November 04, 2019,   1:29 PM IST
Share on:
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...

కాంగ్రెస్ పార్టీపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ వైఖరిని ఆమె తప్పుబట్టారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ ను రద్దు చేయడం, జమ్మూకశ్మీర్ ప్రజలను మోసం చేసే విషయంలో బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడుతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ మాదిరిగానే మత విద్వేష రాజకీయాలకు తెరతీస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఈ ఉదయం ట్వీట్ చేశారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.