(Local) Sun, 17 Oct, 2021

అమిత్ షా కు ముఫ్తీ కూతురు ఇల్తీజా ఘాటు లేఖ

August 17, 2019,   11:05 AM IST
Share on:
అమిత్ షా కు  ముఫ్తీ కూతురు ఇల్తీజా ఘాటు లేఖ

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా జావేద్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కాశ్మీరీలను జంతువుల వలే పంజరంలో వేశారని, భయంకరమైన పరిణామాలతో బెదిరింపులకు గురవుతున్నామన్నారు. ఇల్తీజా జావేద్ రాసిన లేఖలో ఏముందంటే… 
 “కాశ్మీరీలను జంతువుల వలె పంజరంలో వేశారు. వారు ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయారు. ప్రధాన నాయకులను అరెస్టు చేశారు. ఇద్దరు మాజీ సీఎంలను గృహ నిర్భందం చేశారు. నేను మీడియాతో మాట్లాడానన్న కారణంతో నన్ను నిర్బందించారు. నేను మాట్లాడితే భయంకరమైన పరిణామాలతో బెదిరిస్తున్నారు. నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశంలో పౌరుడికి మాట్లాడే హక్కు లేని పరిస్థితి నెలకొంది. దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటుంటే మాకు మాత్రం ఆ అవకాశం లేదు. జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదాను అంతం చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ప్రభుత్వం అన్ని సేవలు నిలిపేసి సమాచార మార్పిడి చేస్తుంది. నేను నిరంతరం నిఘాలో ఉన్నాను. కాశ్మీరీలతో పాటు నా జీవితం గురించి నేను భయపడుతున్నాను. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది. నిత్యం భయపడుకుంటూ బతకాల్సి వస్తుంది. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలి. ప్రభుత్వం సమాధానం చెప్పాలి.” అని అమిత్ షాకు రాసిన లేఖలో ముఫ్తీ కూతురు ఇల్తీజా జావేద్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

సంబంధిత వర్గం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.