(Local) Sat, 24 Jul, 2021

మొహబూబా ముఫ్తీని కలుసుకునేందుకు ఇతిజాకు అవకాశం

September 05, 2019,   4:10 PM IST
Share on:
మొహబూబా ముఫ్తీని కలుసుకునేందుకు ఇతిజాకు అవకాశం

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీని కలుసుకునేందుకు ఆమె కూతురు ఇతిజా జావెద్ కు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ లో పలువురు కీలక నేతలను గృహ నిర్భందం చేశారు. అందులో భాగంగా మొహబూబా ముఫ్తీని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆమె కూతురు ఇతిజా ఓ వీడియో చేసి సామాజిక మీడియాలో పెట్టింది. ఇది వైరల్ గా మారి అందరిని ఆలోచింప చేసింది. తన తల్లిని కలుసుకునేందుకు అనుమతివ్వాలని ఇతిజా సుప్రీంను ఆశ్రయించారు. దీని పై నేడు విచారించిన సుప్రీం ధర్మాసనం ఆమెను కలుసుకునే అవకాశం కల్పించింది. సీతారాం ఏచూరి త‌ర‌హాలోనే ఇతిజాకు క‌శ్మీర్ వెళ్లే అవ‌కాశం ఇవ్వాల‌న్నారు.

సంబంధిత వర్గం
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
మెహబూబా ముఫ్తీని తీవ్రవాదిగా ప్రకటించండి - శివసేన
మెహబూబా ముఫ్తీని తీవ్రవాదిగా ప్రకటించండి - శివసేన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.