(Local) Sat, 23 Oct, 2021

మేఘాలయ విద్యార్థికి అరుదైన అవకాశం

August 31, 2019,   9:52 AM IST
Share on:
మేఘాలయ విద్యార్థికి అరుదైన అవకాశం

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు చెందిన గిరిజన విద్యార్థికి ప్రధాని నరేంద్రమోడీతో కలిసి వచ్చే నెల 7న బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రుడిపై అడుగు పెట్టే మధుర క్షణాలను ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం లభించింది. రిబైత్ ఫావా అనే ఈ విద్యార్థి సోహ్రాలోని రామకృష్ణా మిషన్ సెకండరీ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతను ఎన్‌సిసి క్యాడెట్ కూడా. ‘ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వామి అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రంలో ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించబోయే వారిలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉంటారు’ అని ఫావా పిటిఐతో అన్నారు. ఇస్రో నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీలో గెలుపొందిన తర్వాత ఫావాను ఇందుకు ఎంపిక చేసినట్లు రక్షణ శాఖ పిఆర్‌ఓ వింగ్ కమాండర్ రత్నాకర్ సింగ్ చెప్పారు.

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.