(Local) Wed, 02 Dec, 2020

సుష్మా స్వరాజ్ మాట నిలబెట్టిన కూతురు

September 28, 2019,   11:44 PM IST
Share on:
సుష్మా స్వరాజ్ మాట నిలబెట్టిన కూతురు

దివంగత బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ఇచ్చిన మాటను ఆమె కూతురు బన్సూరి స్వరాజ్ నెరవేర్చారు. కుల్ భూషన్ జాదవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో వాదించినందుకు భారత్ తరపున రూపాయి ఫీజు తీసుకుంటానని న్యాయవాది హారీష్ సాల్వే చెప్పిన విషయం తెలిసిందే. సుష్మా స్వరాజ్ ఆగష్టు 6 వ తేదిన మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి గంట ముందు హరీష్ సాల్వేకు ఫోన్ చేసి కేసు వాదించినందుకు గాను ఫీజు రూపాయి వచ్చి తీసుకొని వెళ్లాలని చెప్పారు. ఆ తర్వాత గంటకే సుష్మా స్వరాజ్ అకాలమరణం చెందారు. దీంతో తన తల్లి ఇస్తానన్న రూపాయి ఫీజును సుష్మ కూతురు బన్సూరి స్వరాజ్ శుక్రవారం సాయంత్రం హరీష్ సాల్వేను ఆయన నివాసంలో కలుసుకొని అందజేశారు.

సంబంధిత వర్గం
కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసులో పాక్‌పై భారత్‌ విజయం
కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసులో పాక్‌పై భారత్‌ విజయం
కుల్ భూషణ్ ను కలిసిన భారత అధికారి
కుల్ భూషణ్ ను కలిసిన భారత అధికారి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.