(Local) Sun, 20 Sep, 2020

ప్రతిపక్షాల జమ్మూ కాశ్మీర్ సందర్శనను తప్పుబట్టిన మాయావతి

August 26, 2019,   1:17 PM IST
Share on:
ప్రతిపక్షాల జమ్మూ కాశ్మీర్ సందర్శనను తప్పుబట్టిన మ ...

 జమ్మూ కశ్మీరును సందర్శించడానికి ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాన్ని బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి తప్పుపట్టారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికిన మాయావతి ఆ నిర్ణయానికే కట్టుపడి ఉన్నట్లు సోమవారం ప్రకటించారు. దేశ సమైక్యత, సమగ్రత, సమానత్వానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చివరి వరకు నిలబడ్డారని, జమ్మూ కశ్మీరులో ఆర్టికల్ 370 అమలును వ్యతిరేకించిన అంబేదర్ బాటలోనే తాము కూడా పార్లమెంట్‌లో ఆర్టికల్ 370 రద్దును బలపరిచామని మాయావతి ట్వీట్ చేశారు.జమ్మూ కశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కొంత సమయం పడుతుందని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పినందున మనమంతా వేచి ఉండాలని ఆమె ప్రతిపక్షాలకు సూచిస్తూ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీరులో అర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించిన ఆమె ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వలలో పడుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కేంద్రం, అక్కడి గవర్నర్ అనుమతి లేకుండా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కశ్మీరును సందర్శించడం వల్ల కేంద్రం ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి మరింత అవకాశం దొరికిందని ఆమె వ్యాఖ్యానించారు.

సంబంధిత వర్గం
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.