(Local) Sat, 24 Jul, 2021

హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణ స్వీకారం

October 28, 2019,   10:23 AM IST
Share on:
హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణ స్వీకారం

హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాలా ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ సత్యదేవ్ ఆర్య ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, పంజాబ్ మాజీ సీఎం బాదల్ హాజరయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు సాధించింది. దీంతో పది సీట్లు సాధించిన జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం పదవి దుష్యంత్ చౌతాలా తల్లి నైనా చౌతాలాకు ఇస్తారని ప్రచారం జరిగినా చివరికి దుష్యంతే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. హర్యానా సీఎంగా ఖట్టర్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.