(Local) Wed, 21 Oct, 2020

ప్రజల మనోభావాలకనుగుణంగా అయోధ్యతీర్పు

October 28, 2019,   12:11 PM IST
Share on:
ప్రజల మనోభావాలకనుగుణంగా అయోధ్యతీర్పు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు ప్రసంగించిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో అయోధ్య, రామజన్మభూమి అంశం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాని 2010 సెప్టెంబర్‌లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయని, త్వరలోనే తీర్పు రానుందని అన్నారు. దేశంలోని ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తీర్పు ఉంటుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. తీర్పు వెలువడానికి ఐదు రోజులు పడుతుందో, ఏడు రోజులు, పది రోజులు పడుతుందో తాను చెప్పలేనని, అయితే తీర్పు వెలుడగానే కోట్లాది మంది ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తుందని, ఆశ్చర్యపరచే మార్పును కలిగిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయవ్యవస్థ గర్వపడేలా ఉంటుందనే విశ్వాసాన్ని మోడీ వ్యక్తపరిచారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.