(Local) Wed, 26 Feb, 2020

మన్మోహన్ సింగ్ కు సెక్యూరిటీ తొలగింపు

August 26, 2019,   12:42 PM IST
Share on:
మన్మోహన్ సింగ్ కు సెక్యూరిటీ తొలగింపు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఉన్న ఎస్పీజీ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది. ఆయనను సీఆర్ఫీఎఫ్ బలగాల భద్రత కిందకు తీసుకొచ్చింది. దేశంలోని ప్రముఖుల భద్రతను సమీక్షించే విభాగం నివేదికల ఆధారంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ప్రముఖుల జీవితాలకు ముప్పు ఎంత వరకు ఉందనే వార్షిక సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మన్మోహన్ కు ఎస్పీజీ భద్రతను తొలగించినప్పటికీ… ఆయనకు  ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు, పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్… తన భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.