(Local) Fri, 17 Sep, 2021

మోదీ డబ్బులు వేస్తున్నారని అనుకున్నా!

November 23, 2019,   10:59 AM IST
Share on:
మోదీ డబ్బులు వేస్తున్నారని అనుకున్నా!

మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ జిల్లా రోనికి చెందిన హుకుంసింగ్‌ బ్యాంకు ఖాతాలోకి ప్రతినెలా వేల రూపాయలు  జమవుతున్నాయి. దీంతో నల్లధనాన్ని వెలికితీసి, దేశ ప్రజలకు పంచుతానన్న వాగ్దానాన్ని ప్రధాని మోదీ అమలుచేస్తున్నారని ఆయన భావించారు. అయితే బ్యాంకు మేనేజర్‌ పొరబాటు వల్లే ఇదంతా జరిగిందని తర్వాత తెలిసింది. అలంపూర్‌లోని ఎస్బీఐ బ్యాంకులో హుకుంసింగ్‌కు ఖాతా ఉన్నది. అయితే రురాయి గ్రామానికి చెందిన హుకుంసింగ్‌ పేరు కలిగిన మరోవ్యక్తికి కూడా మేనేజర్‌ రాజేశ్‌ సొంకర్‌ అదే ఖాతా నంబర్‌ను కేటాయించారు. రురాయికి చెందిన హుకుంసింగ్‌ కొన్ని నెలలుగా ఖాతాలో సొమ్మును జమ చేస్తుండగా.. రోనికి చెందిన హుకుంసింగ్‌ డ్రా చేసుకుంటున్నారు. రూ.1.4 లక్షల వరకు ఉండాల్సిన చోట రూ. 35 వేలే కనిపించడంతో బాధితుడు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. సమస్య పరిష్కరిస్తామని అధికారు హామీ ఇచ్చారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.