(Local) Mon, 27 Sep, 2021

సింహం ఎన్‌క్లోజర్‌లో దూకిన యువకుడు

October 17, 2019,   3:54 PM IST
Share on:
సింహం ఎన్‌క్లోజర్‌లో దూకిన యువకుడు

ఢిల్లీ జూలోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన ఒక 21 ఏళ్ల యువకుడిని జూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వెదురు కంచె ఎక్కి సింహం ఎన్‌క్టోజర్‌లోకి దూకిన ఆ యువకుడు సింహం ముందు కూర్చుని ఉండడాన్ని చూసిన సందర్శకులు పెద్దపెట్టున హాహాకారాలు చేశారు. బయటకు వచ్చేయాలంటూ కేకలు వేశారు. ఇంతలో సింహం ఆ యువకుడిని తోసిందే తప్ప అతడిపై దాడి చేయలేదు. ఇది చూసిన జూ సంరక్షకులు, ఫారెస్టు రేంజర్లు వెంటనే లోపలకు దూకి ఆ యువకుడిని రక్షించారు. బీహార్‌కు చెందిన ఆ యువకుడిని పోలీసు స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నామని ఆగ్నేయ ఢిల్లీ డిసిపి చిన్మయ్ బిస్వాల్ తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.