(Local) Sat, 19 Oct, 2019

దుర్గాపూజలకు మమతా బెనర్జీకి వెల్లువెత్తిన ఆహ్వానాలు...

September 23, 2019,   3:34 PM IST
Share on:
దుర్గాపూజలకు మమతా బెనర్జీకి వెల్లువెత్తిన ఆహ్వానాల ...

ప్రతి ఏటా పశ్చిమ బెంగాల్‌లో దుర్గా నవరాత్రులు అంగరంగవైభవంగా జరుగుతాయన్నది విదితమే. శరన్నవరాత్రుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తం ఉరూరా, వాడవాడలా దుర్గా దేవి విగ్రహాలను ప్రతిశిటించి విశేషంగా పూజలు జరుపుతారు. ఈ నేపథ్యంలో దుర్గా నవరాత్రులు నిర్వహించే 3,000కు పైగా ఉత్సవ నిర్వాహకుల నుంచి తృణమూల్ నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వాన పత్రాలు అందాయి. అందుచేత ఈసారి దుర్గానవరాత్రుల సందర్భంగా అత్యధిక పూజల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దుర్గా నవరాత్రుల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో ఏర్పాటు కానున్న 3 వేల మండపాల నిర్వాహకులు దుర్గా పూజల మొదటి రోజున కుదరకపోయినా, ఈ తొమ్మిది రోజుల్లో ఎప్పడైనా సరే హాజరు కావాలని మమతకు మొరపెట్టుకుంటున్నారు. ఇంతేకాకుండా ఢిల్లీ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తర‌ప్రదేశ్‌లలో నిర్వహించే దుర్గా ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం మమతా బెనర్జీకి ఆహ్వానాలు అందాయి. ఇక కోల్‌కతాలో నిర్వహించే దుర్గాపూజా కార్నివాల్‌ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.

సంబంధిత వర్గం
గంగూలీ ని మెచ్చకున్న మమతా
గంగూలీ ని మెచ్చకున్న మమతా
బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ అమలుచేసేది లేదు..!
బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ అమలుచేసేది లేదు..!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.